Wednesday, January 18, 2017

ఈ డ్రింక్ తాగితే.. మీ ఆహారం కొవ్వుగా మారదు | Natural Drink That Melts Fa...

మనం తినే ఆహారం సరిగ్గా లేక ఏం తినాలన్నా భయమే అవుతుంది.. మరికొందరు బద్దకస్తులు ప్రతీరోజు బయట దొరికే జంక్ పుడ్ తినడానికే ఇష్టపడతారు. ఇంకేముంది ఇక అనారోగ్యానికి గురి కావడానికి మనం సిద్దంగా ఉన్నామన్న మాట. అయితే ఈ సమస్యల్లో మరీ ముఖ్యమైన సమస్య బరువు పెరిగిపోతుండటం.. కొవ్వు పేరకు పోయి శరీరం షేప్ మారి వికృతంగా కనిపిస్తాము.. ఇంకేముంది బరువు పెరగటమంటే అంతకన్నా పెద్ద సమస్య ఏం ఉంటుంది. మన ఆహారపు అలవాట్లతో ఒంట్లో కొవ్వు పేరకు పోవటం సాధారణమైంది. అయితే మనం ఉదయాన్నే లేచి వ్యాయామం గానీ చేస్తున్నామా.. అంటే అదీ లేదు. అందుకే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య అధిక బరువు. అయితే తినే ఆహారంలో కొవ్వు ఒంటికి పట్టకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది.. అవును దానికి ఒక పరిష్కారం ఉంది.. ఉదయం నుంచి తిన్న ఆహారం సులభంగా జీర్ణమై అందులో కొవ్వు కరిగిపోయేలా చేసేందుకు ఓ డ్రింక్ ను ఉపయోగించొచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో సులభంగా తయారు చేసుకొనే ఆ డ్రింక్ ఏంటో తెలుసుకుందాం..… దానికి ఏం కావాలో తెలుసుకుందాం.. 
– నిమ్మకాయ 
– కొత్తమీర
 – దాల్చిన చెక్క
 – వెనిగర్ 
– తేనె లేదా కాస్త అల్లం 

ఎలా తయారు చేసుకోవాలంటే...

నిమ్మకాయ రసం, కొత్తిమీర రసం, దాల్చిన చెక్కను పొడి చేసి, కాస్త వెనిగర్, తేనె లేదా అల్లం రసంతో కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. రాత్రి పడుకోవటానికి ఓ గంట ముందు ఈ మిశ్రమాన్ని తాగాలి. వారం రోజులపాటు ఇలా చేస్తే అద్బుతమైన ఫలితాలు కనపడతాయి. శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఈ డ్రింక్ రాత్రంతా జీర్ణక్రియలో కొవ్వును కరిగిస్తుంది. రాత్రి భోజనం చేసిన 1.30-2 గంటల తర్వాత, నిద్రకు ఉపక్రమించే గంట ముందు ఈ డ్రింక్ తాగితే ఫలితం మెరుగ్గా కనిపిస్తుంది. మరిన్ని intresting విషయాల కోసం మీ..YOYO TV ని subscribe చేయండి


No comments:

Post a Comment